- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్కొక్కటిగా వెలుగులోకి మిర్చి డెవలపర్స్ లీలలు..!
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు ప్రాంతంలో వివాదాస్పదమైన మిర్చి డెవలపర్స్ వెంచర్ వివాదంలో తవ్వేకొద్దీ రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది. అప్పటి రెవెన్యూ అధికారులు జీ హుజూర్ అంటూ సదరు సంస్థ అడుగులకు మడుగులొత్తే విధంగా పూర్తి సహాయ సహకారాలు అందించారు. గత ప్రభుత్వంలో ఒక మంత్రి అండదండలతో అధికారుల సహకారంతో నిబంధనలు పక్కన అడ్డగోలుగా పెట్టి మిర్చి డెవలపర్స్ సంస్థకి గ్రీన్ కార్పెట్ పరిచారు. ఒకపక్క అసైన్డ్ భూములను చెరబట్టడంతో పాటు పట్టా భూముల్లో సైతం వివాదాలున్న పూర్తిగా సహకరించారు. 18.33 ఎకరాలలో వెంచర్ చేసిన మిర్చి డెవలపర్స్ సర్వే నంబర్ 209లో మొదట రెండు సార్లు నాలా కన్వర్షన్ చేయడం విశేషం. రెండుసార్లు కన్వెన్షన్ అయిన భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకం జారీ చేయడం మరొక విడ్డూరమనే చెప్పొచ్చు. మిర్చి డెవలపర్స్ సంస్థకు లబ్ధి చేకూర్చడమే కర్తవ్యంగా అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒకే భూమి మూడు సార్లు నాలా కన్వర్షన్..
18.33 ఎకరాలలో వెంచర్ చేసిన మిర్చి డెవలపర్స్ సర్వే నంబర్ 209లో మొదట రెండు సార్లు నాలా కన్వర్షన్ చేయడం విశేషం. రెండుసార్లు కన్వెన్షన్ అయిన భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకం జారీ చేయడం మరొక విడ్డూరమనే చెప్పొచ్చు. మొదట 1994 సంవత్సరంలో రోలింగ్ మిల్లుకు ప్రోసిడింగ్ నం బి1/7851/94తో నాలా కన్వర్షన్ చేయగా తిరిగి అదే భూమికి 28/10/1998 స్కూటర్ స్పేర్ పార్ట్స్ పరిశ్రమకు సంబంధించి డి1/8604/98 ప్రోసీడింగ్ నంబర్‌తో మరోసారి ఇండస్ట్రీ కింద నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్షన్ చేశారు. తిరిగి ఇదే భూమిని 2013 ఆగస్టు నెలలో 293 గుంటలుగా వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. తిరిగి ముచ్చటగా మూడోసారి వ్యవసాయేతర భూమిగా మార్చినట్లు తెలుస్తుంది. ఇదే వెంచర్ కి సంబంధించి సర్వే నెంబర్ 212లో కోర్టు ద్వారా పొందిన భూమిని సైతం నాలా కన్వర్షన్ అయ్యాక తిరిగి 2013లో వ్యవసాయ భూమిగా మార్చినట్లు సమాచారం.
మేము అనుకుంటే అన్ని సాధ్యమే..
తాము అనుకుంటే అన్ని సాధ్యమే అన్నచందంగా అప్పటి రెవెన్యూ అధికారులు వ్యవహరించారు. మిర్చి డెవలపర్స్ సంస్థకు లబ్ధి చేకూర్చడమే కర్తవ్యంగా అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు వెంచర్ లోని సర్వే నెంబర్ 210లో రిజిస్ట్రేషన్ కు ఐదు నెలల ముందుగా మ్యుటేషన్ చేయడం విశేషం. సదరు సర్వే నెంబర్ లోని భూమిని 21-12-2014 నాడు రిజిస్ట్రేషన్ చేయగా సదరు భూమికి సంబంధించిన మ్యుటేషన్ మాత్రం 28/07/2014లో ప్రొసీడింగ్ నం బీ/1833/2014న చేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఈ తంతును పూర్తి చేసిన అధికారికి డిసెంబర్ నెలలో జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెలిసి ఐదు నెలల ముందుగానే జూలై నెలలో ప్రోసిడింగ్ జారీ చేయడం చూస్తుంటే సదరు సంస్థ కోసం రెవెన్యూ యంత్రాంగం పడిన పాట్లు అర్థం చేసుకోవచ్చు..
ఇది మరీ విచిత్రం...
పటాన్ చెరు మండలం పాటి గ్రామపంచాయతీ పరిధిలో 18.33 ఎకరాల్లో వెంచర్ చేసిన మిర్చి డెవలపర్స్ యాజమాన్యానికి అప్పటి రెవెన్యూ అధికారులు పూర్తిగా దాసోహం అయ్యారని చెప్పవచ్చు. ఒకే తేదీల్లో రెండు ప్రోసిడింగ్ పత్రాలను వేరే వేరే ప్రభుత్వాలు జారీ చేయడం వింతగా చెప్పుకోవచ్చు. 28/07/2014 నాడు 10.05 ఎకరాల ప్రోసీడింగ్ తెలంగాణ ప్రభుత్వం పేరుతో జారీ చేస్తే మిగిలిన 8.27 ఎకరాలకు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీ అదే తేదిలో ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ఇష్యూ చేశారు. సదరు కంపెనీకి సహకరించాలని ఉద్దేశంతో అప్పటి అధికారులు అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారులు ఈ రిజిస్ట్రేషన్ కొటేషన్ ప్రక్రియను పాత తేదీల్లో పూర్తిచేసే తంతులో భాగంగానే ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి.
అడ్డగోలుగా నిబంధన ఉల్లంఘనలు..
అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారం ఉండడంతో మిర్చి డెవలపర్స్ సంస్థకి అధికారులు దాసోహం అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అసైన్ భూమిని ఆక్రమించి విలాసవంతమైన విల్లాలు నిర్మించిన వ్యవహారంలో అధికారులు పూర్తిగా సదరు సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అన్ని తానై వ్యవహరించి సహకరించిన ఒక అధికారి ప్రమేయంతో సదరు సంస్థ ఈ ఇష్యూ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్లు 193/5/1,193/5/2 భూమి పీఓటీ యాక్ట్- 1977 ప్రకారం నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్న అధికారులు మాత్రం సదరు సంస్థకు పూర్తిగా సహకరించే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సర్వేనెంబర్ 193 లో ఒక వ్యక్తికి గతంలో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి మిర్చి డెవలపర్స్‌ని వివాదం నుంచి బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. సదరు అలాట్మెంట్ వేరే చోట జరగగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సదరు నిర్మాణాలు జరిగిన ప్రాంతంలో చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మొత్తం మీద అధికారులు మిర్చి డెవలపర్స్ సంస్థకు దాసోహం అన్నట్లు వ్యవహరిస్తూ ఆ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.
మిర్చి డెవలపర్స్‌పై చర్యలకు అలసత్వం ఎందుకు: ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పూర్తి ఆధారాలతో ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు సదరు సంస్థపై చర్యలు తీసుకోవడానికి అధికారులు తాత్సారం చేస్తున్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఆ ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు భూ అక్రమాలకు తెరలేపాలనడానికి సాక్ష్యంగా మిర్చి డెవలపర్స్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ దగ్గర బంధువు భూమి కావడంతోనే అధికారులు అడ్డగోలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రిజిస్ట్రేషన్ చేయడానికి ఐదు నెలల ముందుగానే ఒక రెవెన్యూ అధికారి మ్యుటేషన్ ప్రొసీడింగ్ జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఐదు నెలల ముందుగానే డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అవుతుందని అధికారి కలలో కి వచ్చి ముందుగానే మ్యుటేషన్ జారీ చేసి అద్భుతం సృష్టించాడు. ఒకేరోజు రెండు ప్రభుత్వాల పేరుతో ప్రోసిడింగులు జారీ చేశాడు. ఈ వ్యవహారంలో సదరు అధికారి భారీగా లబ్ధి పొంది అధికార దుర్వినియోగంతో సదరు సంస్థకు సహకరించాడని అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కలగజేసుకొని నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలి. ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం.
కలెక్టర్‌కు నివేదిక అందించాం: తహసీల్దార్ రంగారావు
మిర్చి డెవలపర్స్సంస్థ అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించాం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ అనంతరం వారి ఆదేశాలు సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం.