సోషల్ మీడియాలో నకిలీ రూ.500 నోటు వైరల్..

by Sumithra |
సోషల్ మీడియాలో నకిలీ రూ.500 నోటు వైరల్..
X

దిశ, మంగపేట : మండలంలో నకిలీ రూ. 500 నోట్లు చెలామణీ అవుతున్నాయంటూ సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో సోమవారం పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. మండల కేంద్రంలోని కొందరు వ్యాపారులకు నకిలీ రూ. 500 నోటు కొనుగోలు దారు ఇవ్వడంతో అది బయటపడ్డట్లు చెబుతున్నారు. అసలు నోటుకు నకిలీ నోటుకు ఒక అక్షరం తేడా ఉండడంతో గుర్తించలేకుండా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో నకిలీ నోటును ప్రదర్శిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

ఒరిజినల్ రూ. 500 నోటుపై RESERVE ఉండాల్సి ఉండగా నకిలీ నోటు పై RESARVE అని ముద్రించి చలామణి చేస్తున్నారన్నారు. దీనిని వ్యాపారులు, ప్రజలు గుర్తించాలని సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సై టీవీఆర్ సూరిని వివరణ కోరగా నకిలీ నోట్ల చలామణి తమ దృష్టికి రాలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ నోట్ల చలామణి పై ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

Advertisement

Next Story