Telangana Police: పండుగకు ఊరెళ్తున్నారా..? ఇలా చేయండి

by Ramesh Goud |   ( Updated:2025-01-08 13:24:53.0  )
Telangana Police: పండుగకు ఊరెళ్తున్నారా..? ఇలా చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: పండుగకు ఊరెళ్తున్నారా ఇలా చేయండి అని తెలంగాణ పోలీస్(Telangana Police) ట్వీట్ చేసింది. సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా దోపిడిలపై అవగాహన కల్పిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. ఈ సందర్భంగా పెట్టిన పోస్టులో.. పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్త అని, సీసీ కెమెరాలు(CC Camera) తప్పకుండా ఏర్పాటు చేసేకోండి అని సూచించింది. అలాగే సీసీ కెమెరాలు పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలని, యాప్ ద్వారా సీసీ టీవీలను తరచూ పరిశీలించాలని తెలిపింది. అంతేగాక ఇంట్లో లైట్లు వేసి వెళ్లాలని, తాళం వేసిన సంగతి తెలియకుండా కర్టెన్ వేయండి అని చెప్పింది. ఒక పక్కింటి వారికి సమాచారమివ్వండి అని, బంగారం, నగదు ఇంట్లో పెట్టకండి అని, బీరువా తాళాలు ఇంట్లో పెట్టొదని తెలంగాణ పోలీస్ సూచనలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed