Supreme court: విభేదాలున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు గౌరవంగా ప్రవర్తించాలి.. సుప్రీంకోర్టు

by vinod kumar |
Supreme court: విభేదాలున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు గౌరవంగా ప్రవర్తించాలి.. సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు గౌరవంగా ప్రవర్తించాలని సుప్రీంకోర్టు (Supreme court) సూచించింది. విభేదాలు ఉన్న టైంలోనూ అగౌరవంగా ప్రవర్తించకూడదని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని నొక్కి చెప్పింది. ఇది సరైన సంప్రదాయం కాదని తెలిపింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ (Nithish kumar) పై చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్ర శాసన మండలి నుంచి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత సునీల్ కుమార్ సింగ్ బహిష్కరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సభలో వాక్ స్వాత్రంత్రానికి విస్త్రృత అవకాశాలున్నాయని తెలిపారు. వాదనలు విన్న బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. తుది విచారణకు సిద్ధం కావాలని సింగ్వికి సూచించింది. వాదనలకు ఎక్కవ సమయం కూడా కేటాయించబోమని తెలిపింది. కాగా, గతేడాది జూలై 26న బిహార్ శాసనమండలిలో అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను సునీల్ కుమార్ సింగ్‌ను సభ సభ నుంచి బహిష్కరించారు.

Advertisement

Next Story