కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా..?

by Naveena |
కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా..?
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ఐటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా అనుపటి రమేష్ ముదిరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రమేష్ ముదిరాజును కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, నాగర్ కర్నూల్ ఐటీ సెల్ అధ్యక్షునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఘనంగా సన్మానించి, రమేష్ ముదిరాజ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అని రమేష్ వెల్లడించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షుడు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రెడ్డి , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కి రమేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story