AP High Court: మాజీ సీఎం జగన్‌కు భారీ ఊరట

by Gantepaka Srikanth |
AP High Court: మాజీ సీఎం జగన్‌కు భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP High Court)లో మాజీ సీఎం, వైసీపీ(YCP) అధినేత జగన్‌(Jagan)కు భారీ ఊరట లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. జగన్‌కు పాస్‌పోస్టు మంజూరు చేయాలని ఆదేశించింది. ఐదేళ్ల వ్యవధికి పాస్‌‌పోస్ట్ మంజూరుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్‌పోర్ట్ కోసం ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా, అంతకుముందు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టు ఇప్పించాలని, దీనిపై పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed