- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: ఏపీ పేపర్ మిల్లు లాకౌట్.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్నేషన్ ఏపీ పేపర్ మిల్లు(Internation AP Paper Mill)కు లాకౌట్(Lockout) ప్రకటించారు. దీంతో కార్మికులు(workers) ఆందోళనకు దిగారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలంటూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల ఆందోళనతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మిల్లు వద్దకు భారీగా చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కూడా మిల్లు వద్దకు భారీగా చేరుకున్నారు. కార్మికులు ఆందోళనను విరమించాలని సూచించారు. అయినా సరే కార్మికులు వెనక్కి తగ్గడంలేదు. మిల్లు లాకౌట్ ఎత్తివేసి, తమకు జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కాగా 1898లో ప్రారంభమైన ఈ పేపర్ మిల్లు ఆ తర్వాత కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఇంటర్నేషన్ ఏపీ పేపర్ మిల్లుగా పిలవబడింది. ప్రస్తుతం పేపర్ మిల్లులో కార్మికులకు చాలా కాలంగా జీతాలు పంచలేదు. దీంతో యాజమాన్యంతో కార్మికులు సంప్రదింపులు జరిపారు. అయితే సానుకూలమైన ప్రకటన రాకపోవడంతో పలుమార్లు కార్మికులు నిరసన హెచ్చరికలు చేశారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఐదు రోజలు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా జీతాలు పెంచాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో మిల్లుకు లాకౌట్ ప్రకటించారు.