KTR: ఏసీబీ కార్యాలయం ఎదుట హైడ్రామా.. తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయిన కేటీఆర్

by Shiva |   ( Updated:2025-01-06 05:43:58.0  )
KTR: ఏసీబీ కార్యాలయం ఎదుట హైడ్రామా.. తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ (ACB) కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే, విచారణలో కేటీఆర్ వెంట వచ్చిన లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ లాయర్లను అనుమతించకపోతే తిరిగి ఇంటికి వెళ్లిపోతానని ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తెలిపారు. అదేవిధంగా విచారణకు లాయర్లను అనుమతించకపోవడంపై ఏసీబీ అధికారులు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ (KTR) కోరారు. అయితే వారి స్పందన కోసం కేటీఆర్ (KTR), ఏసీబీ కార్యాలయం ఎదుట 30 నిమిషాలు వేచి చూశారు. అధికారుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కేటీఆర్ నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్‌‌కు వెళ్లిపోయారు.

Advertisement

Next Story