పలువురు బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్..

by Sumithra |   ( Updated:2025-01-06 06:03:23.0  )
పలువురు బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్..
X

దిశ, శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. రాయదుర్గం ఓరియన్ విల్లాస్ లోని కేటీఆర్ ఇంటి వద్ద తెల్లవారుజామున ఉండే భారీగా పోలీసులను మోహరించారు. అటు బీఆర్ఎస్ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ లు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

కొండాపూర్ కొల్లా లగ్జరియా విల్లాస్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే బీఆర్‌ఎస్వీ నేత మేకల విద్యాసాగర్‌ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. విచారణ పేరుతో అరెస్ట్‌ ల పై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story