- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన సంఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితుడు బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం నవాబుపేట్ మండల్ మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి భార్య స్వప్న దంపతులకు గత 4వ తారీఖున సిజేరియన్ ద్వారా బాబు జన్మించాడు. ఆ తర్వాత బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూ బాబును తల్లిదండ్రులకు అప్పగించారు డాక్టర్లు.
కానీ 6వ తారీకు సోమవారం రాత్రి తెల్లవారుజామున బాబుకు ఎక్కిళ్లు ప్రారంభమయ్యాయి. దాంతో డ్యూటీ డాక్టర్ ను పిలువగా, డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో అందుబాటులో లేడు అని బాధితులు ఆరోపిస్తున్నారు. స్టాప్ నర్సుల ద్వారా డాక్టర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపలేదని, డాక్టర్ సమయానికి వచ్చి ఉంటే తమ బాబు బతికేవాడని బాధితుడు బిక్షపతి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ఆసుపత్రి ముందు బైఠాయించారు.