- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి బ్యూటీ.. టు బి హస్బెండ్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: ‘అరుంధతి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన దివ్య నగేశ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో ఈ భామ నటనకు నంది అవార్డు సైతం వరించింది. పెద్ద పెద్ద కళ్ళతో, తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ జోష్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దివ్య నగేష్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘కొన్ని వంతెనలను దాటడం చాలా కష్టమని నేను భావించినప్పుడు, మీరు నిశ్శబ్దంగా వాటి గుండా నడవడానికి నాకు సహాయం చేశారు.
నేను పూర్తిగా చీకటిలో ఉన్నప్పుడు మీరు నా జీవితంలోకి వెలుగుని తెచ్చారు. ఇది ముగింపు అని నేను అనుకున్నప్పుడు, మీరు నాకు కొత్త ప్రారంభాన్ని చూపించారు. చాలా మంది మా సంబంధాన్ని నిర్ధారించారు, వ్యాఖ్యానించారు కానీ మీరు నా జీవితంలో నా కోసం ఏమి చేశారో ఎవరికీ తెలియదు. అధికారికంగా మీ భార్య కావడానికి ఇంకా వేచి ఉండలేము అజి’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. సెలబ్రిటీలు, నెటిజన్లు, ఆమె అభిమానులు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు.