Results IBPS: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల

by Shiva |
Results IBPS: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్స్) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష ఫలితాలను ఇవాళ ఐబీపీఎస్ (IBPS) విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో అక్టోబర్ 6న మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 9.923 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే CRP RRBs ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, ఆఫీసర్ స్కేల్-2 (SO), ఆఫీసర్ స్కేల్-3 ఫలితాలను ఇవాళ విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed