- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gold Prices : కొత్త ఏడాదిలో తులం బంగారం 90వేలకు పరుగు !
దిశ, వెబ్ డెస్క్ : కొత్త ఏడాది(New Year)2025సంబరాలు కొనసాగుతుండగానే ప్రజలను పసిడి ధరల(Gold Prices) అంచనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. బంగారానికి భారతీయులు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బంగారం వారికి అలంకారమే కాదు...దర్పానికి గౌరవానికి చిహ్నంగానే కాకుండా అత్యవసర ఆర్థిక భద్రత మార్గంగా, సురక్షిత పెట్టుబడిగా..మధింపుగా కూడా భావిస్తారు. అలాంటి బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోతుండటం కలవరం కల్గించేది. బంగారం ధరలు కొత్త ఏడాదిలో మరింతగా పెరుగుతాయన్న(Gold is More Expensive). సమాచారం బంగారం ప్రియులను భయపెడుతోంది. దేశీయ మార్కెట్‌లో తులం 24 క్యారెట్ పసిడి ధర 2025లో రూ.85,000 స్థాయికి వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే ఏకంగా రూ.90,000 మార్కును కూడా చేరవచ్చంటున్నారు. 2024లో కూడా బంగారం ధరలు క్రమేణా పెరుగుతు వచ్చి ఒక దశలో అక్టోబర్ 30న 24 క్యారెట్‌ల 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో రూ.82,400 పలికింది. తర్వాతా 78వేలకు అటు ఇటుగా కొనసాగుతోంది. నూతన సంవత్సరం స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు తిరిగి విజృంభించే అవకాశాలే ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మునుముందు పెళ్లిళ్ల సీజన్ లో ప్రస్తుత ధరలు మరింతగా పెరగడం ఖాయమంటున్నారు.
పసిడి బాటలోనే వెండి
బంగారంతోపాటు వెండి ధరలూ కొత్త ఏడాది పరుగులు పెట్టవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగానే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1.10 లక్షలకు వెళ్లవచ్చని, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల వాతావరణం కొనసాగితే ఏకంగా రూ.1.25 లక్షలు సైతం పలుకవచ్చని పేర్కొంటున్నారు. 2024లో రూ.1,02,000 ల ధరతో దేశీయంగా సిల్వర్ ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే.