Ram Gopal Varma: బిగ్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఇకపై అలా చేయనంటూ ట్వీట్

by Hamsa |
Ram Gopal Varma: బిగ్ షాకిచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఇకపై అలా చేయనంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. వరుస పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇక నూతన సంవత్సరం(New Year) కావడంతో ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలో సాధించబోయే పలు పనుల గురించి నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, ఆర్జీవీ ఓ షాకింగ్ ట్వీట్(Tweet) చేశాడు.

కొత్త సంవత్సరం నేను తీసుకున్న 7 తీర్మానాలు ఇవే..

1. నేను ఇకనుంచి వివాదరహితుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను.

2. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్‌(Family Man)లా ఉండాలని భావిస్తున్నా.

3. దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాను.

4. ఇక నుంచి ప్రతి ఏడాది 10 సత్య లాంటి సినిమాలు తీస్తాను అని మాటిస్తున్నాను.

5. ఎవరిని ఉద్దేశించి నెగిటివ్ ట్వీట్స్ చేయను.

6. ముఖ్యంగా ఆడవారిని అస్సలు చూడను.

7. చివరిది నేను ఇక నుంచి వోడ్కా తాగడం మానేస్తాను.

ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాననిన మీ అందరి మీద ఒట్టేస్తున్నాను. ఒక్క నా మీద తప్ప’’ అని రాసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. హ్యపీ ఓల్డ్ ఇయర్ అని శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్ అవుతుండటంతో ఇక అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇదంతా అయ్యే పని కాదు కానీ ఊరుకో అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story