సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని..

by Sumithra |
సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని..
X

దిశ, రామకృష్ణాపూర్ : భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని తహశీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మందమర్రి తహశీల్దార్ కార్యాలయంలో సావిత్రీబాయి చిత్రపటానికి అధికారులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, విద్యతోనే అసమానతలు, వివక్ష తొలగిపోతాయని అన్నారు. సావిత్రీ బాయి ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పద్మజ బొలిశెట్టి, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed