Breaking: సుప్రీంకోర్టుకు మోహన్ బాబు.. రెండు కేసులపై పిటిషన్ దాఖలు

by srinivas |   ( Updated:2025-01-06 05:22:32.0  )
Breaking: సుప్రీంకోర్టుకు మోహన్ బాబు.. రెండు కేసులపై పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్‌బాబు(Actor Mohan Babu) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జల్లపల్లి(Hyderabad Jalpally)లో తన ఇంటి వద్ద జరిగిన ఘటనల కేసులకు సంబంధించి ఆయన బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తండ్రి ఆస్తుల కోసం తనయులు మంచు విష్ణు(Manchu Vishnu), మనోజ్(Manoj) మధ్య పెద్ద పంచాయతీనే జరిగింది. జల్లపల్లి నివాసంలో వెళ్లేందుకు మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించడం, మంచు విష్ణు అనుచరులు అడ్డుకోవడం, స్థానిక ఫుటేజ్ మాయం కావడం, న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మోహన్ బాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story