'జర్నలిస్టులు విలువలతో పని చేయాలి..'

by Sumithra |
జర్నలిస్టులు విలువలతో పని చేయాలి..
X

దిశ, తల్లాడ : జర్నలిస్టులు విలువలతో పనిచేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టులు గుడిపల్లి నారాయణ, గౌరవ అధ్యక్షులు దుగ్గిదేవ అజయ్ కుమార్ సూచించారు. ఆదివారం తల్లాడ సొసైటీ ఆఫీసులో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, తదితర సమస్యల పై చర్చించారు. కొందరు జర్నలిస్టులు యూనియన్ మహాసభలు, మీడియా సమావేశాలు, సొంత ఖర్చులు అంటూ మండలంలో సంచరిస్తున్న విషయాన్ని తీవ్రంగా ఖండించారు. వివిధ పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులకు ఆయా సంస్థల యాజమాన్యాలు యాడ్స్ టార్గెట్ ఇస్తున్నాయని దానికి అనుగుణంగా పనిచేసుకోవాలన్నారు. అంతేకానీ వ్యక్తిగత స్వలాభం కోసం జర్నలిజాన్ని ఉపయోగించుకొని నైతిక విలువలు కోల్పోవద్దని కోరారు.

తల్లాడ ప్రెస్ క్లబ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని గుర్తింపునకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. స్థానిక రాజకీయ నాయకులు అధికారకంగా జరిగే ఎమ్మెల్యే సభలు, సమావేశాలకు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పంపిణీ జరిగే ప్రోగ్రామ్స్ కు తప్పనిసరిగా విలేకరులకు వాట్సాప్ ద్వారానే కాకుండా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని తీర్మానించారు. లేకుంటే వార్తలు రాయరాదన్నారు. మండల అధికారులు జిల్లా అధికారులు పర్యటనతో పాటు, ప్రభుత్వ ఖజానాకు, ప్రజలకు నష్టం జరిగే ఇష్యూస్ జరిగినప్పుడు అధికారులు జర్నలిస్టులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని తీర్మానించారు.

మండలంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్న విలేకరులు ఎండి ముస్తఫా (సీనియర్ జర్నలిస్ట్) (నవ తెలంగాణ), మోదుగు జయరాజు (వెలుగు), చలపతి గౌడ్ (సూర్య), రుద్రాక్ష నరసింహ చారి (దిశ), షేక్ మెహరాజ్ (రోబో)(ప్రజా కాలం), గొడ్ల శ్రీనివాస్ (సామాజిక తెలంగాణ), గొల్లమందల నాగబాబు (నిజం), కాంపాటి రవి, ఇనపనూరి కుటుంబరావు, అద్దంకి సురేష్ , మేడి యాకూబ్, నారపోగు ప్రసాద్ (జర్నలిస్ట్), ప్రేమ్ కుమార్ (మనమే సాక్ష్యం), షేక్ సైదా (టీవీ17) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story