- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YS Sharmila : రమేష్ బిధూరి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకరమైన సెక్సిస్ట్ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రియాంక చెంపల మాదిరిగా రోడ్లను నిర్మిస్తానంటూ బిధూరి చేసిన వ్యాఖ్యలను నేను తీవ్ర వేదనతో ఖండిస్తున్నానని, బీజేపీ ఆలోచనలు, చర్యలు, సంస్కృతి వారి నాయకులకు మహిళల పట్ల పూర్తి అగౌరవాన్ని చాటుతుందని విమర్శించారు. బిధూరి వ్యాఖ్యలు శిక్షార్హతతో కూడిన విషపూరితమైన సెక్సిజంతో కూడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ వైఫల్యాలు, దురాగతాల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకు, సోనియా, రాహుల్ పైనా వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతుందని షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ప్రియాంకకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని... మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్‌లను కూడా బీజేపీ నేతలు కూడా వదిలిపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. నైతిక విలువలు లేకుండా విమర్శలు చేస్తున్న మతోన్మాద బీజేపీ నేతల దుర్మార్గ వైఖరిని దేశం మొత్తం గమనిస్తోందని, త్వరలో ఈ మతోన్మాదులకు తగిన గుణపాఠం చెబుతుందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి కల్కాజీ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఓ ప్రచార సభలో మాట్లాడుతూ ‘గతంలో ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లాగా చేస్తానంటూ అబద్ధం చెప్పారని... నేను మాత్రం ఓక్లా, సంగం విహార్‌లో రోడ్లను అభివృద్ధి చేసినట్లే కల్కాజీ రోడ్లను కూడా ప్రియాంక బుగ్గల మాదిరి నిర్మిస్తాన’ని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బిధూరి ఎక్స్ వేదికగా ప్రకటించారు.