- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐనవోలు జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష
దిశ, వర్థన్నపేట: హన్మకొండ జిల్లా,ఐనవోలు మండల కేంద్రంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి ఐనవోలు మంగళవారం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాకతీయుల కాలం నాటి నుండి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐనవోలు జాతర నిర్వహించడం జరుగుతుంది. కనుక ఐనవోలు జాతర నిర్వహణలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించు కొనుటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మేడారం జాతర తర్వాత అతిపెద్ద జాతర మన ఐనవోలు జాతరని చెప్పుకోచ్చారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ , పారిశుధ్య నిర్వహణ ప్రతిదీ పకడ్బందీగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కుడా వైస్ చైర్మన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.