ఆర్టీసీ బస్సు ఢీకొని ఆర్ఎంపీ మృతి

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆర్ఎంపీ మృతి
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్ని మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. బూర్గంపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తగూడెం కూలీ లైన్ ఏరియాకు చెందిన రాంకుమార్ హరిప్రసాద్ (43)సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా హరిప్రసాద్ కుటుంబం బూర్గంపాడు మండల పరిధిలోని సందెళ్లరామాపురం గ్రామంలో ఉంటూ ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ స్థానికంగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం ఆయన వ్యక్తి గత పని మీద ద్విచక్రవాహనంపై కృష్ణసాగర్ గ్రామం వెళ్లి తిరిగి రామాపురం వస్తుండగా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు భద్రాచలం నుంచి మణుగూరు వైపునకు వెళ్తూ కృష్ణసాగర్ క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో హరిప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య స్నేహ, కుమార్తె, ఇరువురు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed