డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్దం

by Sridhar Babu |
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్దం
X

దిశ,ఖమ్మం రూరల్ : ప్రభుత్వ లక్ష్యం మేరకు సంక్రాంతి లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. మల్లెమడుగు గ్రామంలో మూడు బ్లాక్ లలో నిర్మిస్తున్న 84 ఇండ్లు, పరిసరాలను కలెక్టర్ తిరిగి క్షుణంగా పరిశీలించారు. చిన్న, చిన్న పనులను రెండు రోజులలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంక్రాంతిలోపు అర్హలైన నిరుపేద లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్ల పంపిణీకి సిద్దం చేయాలని అన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించే వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మల్లెమడుగులో 84, కూసుమంచి మండలం దుబ్బ తండాలో 29, నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో 18 మొత్తం 131 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని పేదలలో నిరుపేదలకు, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ శ్రీనివాసరావు, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఖమ్మం అర్బన్, రూరల్ మండల తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed