ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ పత్రిక..

by Naveena |
ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ పత్రిక..
X

దిశ, నేరేడుచర్ల : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా దిశ పత్రిక పని చేస్తుందని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ మున్సిపాలిటీ ఫోర్ లీడర్ కొణతం చిన్న వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్ల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో దిశపత్రిక నూతన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. దిశ పత్రిక వాస్తవాలను వెలికితీసి జరుగుతున్న విషయాలను వార్తల రూపంలో ప్రజలకు చేరవేయడంలో ముందుంటుందని కొనియాడారు. అధికారం ప్రతిపక్షం అనేది లేకుండా జరిగింది జరిగినట్టు వార్తలను చేరవేస్తుందని అన్నారు. ఇలాగే వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు చేరవేయడంలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి దిశ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రావుల రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతమల్ల సైదులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed