- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కేటాయింపు నిష్పక్షపాతంగా జరగాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ, జూబ్లీహిల్స్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే కేటాయింపు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు, ఇన్ వార్డ్, అవుట్ వార్డ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులు, ఆన్లైన్లో డాష్ బోర్డు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజా పాలన అప్లికేషన్ లు ఆన్లైన్ లో వచ్చిన టెక్నికల్ మిస్టిక్స్ పై ఆరా తీశారు.
ప్రజా పాలన ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని సర్వే, కేటాయింపు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఇన్ వార్డు, ఔట్ వార్డు రిజిస్టర్ సరిగా నిర్వహించడం లేదని లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రికార్డులు క్లియర్ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న భవనాన్ని అంగన్ వాడి లేదంటే ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, తహశీల్దార్ అనితా రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.