- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్హత లేని వైద్యులతో నడుపుతున్న ఆస్పత్రి సీజ్
దిశ, కొత్తగూడెం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ఆ దేశాల మేరకు ప్రోగ్రాం అఫీసర్ డా.ఎం.మధువరన్, డిప్యూటీ డేమో ఫైజ్ మొహిఉద్దీన్ బుధవారం కొత్తగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తూ డయాగ్నస్టిక్ నడుపడం గుర్తించి ఆసుపత్రిని సీజ్ చేశారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు, రక్త పరీక్ష, డయాగ్నస్టిక్ కేంద్రాలకు అన్ని అనుమతులు ఉన్నా అర్హతలు లేని వారు వైద్యం చేసినా, పరీక్షలు నిర్వహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం దంతవైద్యంతో సహా ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, హోమియోపతి, సిద్ధ యునాని, ఫీజియో థెరపీ, రక్త పరీక్ష కేంద్రాలు, డయాగ్నస్టిక్ సెంటర్లు అన్ని రకాల అనుమతులు కలిగి ఉండాలని సూచించారు.