విష ప్రయోగం పై శాంపిళ్ల సేకరణ..

by Sumithra |
విష ప్రయోగం పై శాంపిళ్ల సేకరణ..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం గంగసాముందర్ గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రధాన ప్రతినిధి చిన్న సాయన్నకు చెందిన 60 నాటు కోళ్ల పై విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఈ విష ప్రయోగం వల్ల నూతన ఏడాది తొలి రోజు 60 కోళ్ల తో పాటు అంతకుముందు మరో రెండు మార్లు కూడా ఇదే తరహాలో నాటు కోళ్లు నష్టపోయారని బాధితులు చిన్న సాయన్న ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో శుక్రవారం డొంకేశ్వర్ మండల వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ గంగా సముందర్ లో చిన్న సాయన్నకు సంబంధించిన చనిపోయిన నాటు కోళ్లను పరిశీలించారు. నాటు కోళ్లు ఏ విధంగా చనిపోయాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు మృతి చెందిన నాటు కోళ్ల నుంచి శాంపిళ్లను వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ సేకరించారు. సేకరించిన శాంపిళ్ల ద్వారా నిర్వహించే పరీక్షల అనంతరం నిజానిజాలు పూర్తిగా తెలుస్తుందని వెటర్నరీ వైద్యుడు శ్రీకాంత్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed