- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2: అక్కడ మరో రికార్డు సృష్టించిన పుష్పరాజ్..? నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ సునామీ సృష్టిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.1799 కోట్లు సాధించింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
బేసిక్‌గా పుష్ప-2 రిలీజ్ అయినప్పటి నుంచి బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా తాజాగా మరో మైలు రాయిని చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మొత్తంగా నాలుగు వారాల్లో పుష్ప 2 మూవీ హిందీలో రూ. 798.20 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు లేదా రేపటి లోపు ఈ చిత్రం హిందీలో రూ. 800 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమంటూ ఓ పోస్టర్ చక్కర్లు కొడుతోంది.