Startup Plans: యువతకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు, ఎలా అప్లై చేసుకోవాలంటే..!

by Prasanna |   ( Updated:2025-01-04 02:57:17.0  )
Startup Plans: యువతకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు, ఎలా అప్లై చేసుకోవాలంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఒక్కరికి జీవితంలో ఏదోకటి సాధించాలని ఉంటుంది. దీని కోసం చాలా కష్ట పడతారు.. కొంతమంది సక్సెస్ అయితే, మరి కొంతమంది ఓటమి పాలవుతారు. అయినా కూడా వారి ప్రయత్నాన్ని ఆపరు. ఇలాంటి సమయంలో ఏదొక స్టార్టప్ మొదలు పెట్టి వారి కలను నిజం చేసుకోవాలనుకుంటారు. అయితే, వారి ఆలోచనకు ప్రాణం పోయడానికి నాయకత్వం, తగిన డబ్బులు అవసరమవుతాయి. యువతను వ్యాపారరంగంలో పోత్సహించేందుకు భారతదేశంలో స్టార్టప్‌లకు మద్దతుగా ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను మన ముందు తీసుకొచ్చింది. ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

1. స్టాండ్ అప్ ఇండియా పథకం

ఈ పథకం కింద, ఎస్సీ/ఎస్టీ, మహిళలకు రూ. 10 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణాలను ప్రభుత్వం ఇస్తుంది.

ఎవరు రుణం తీసుకోవచ్చు?

18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు.

ప్రైవేట్ లిమిటెడ్, LLP లేదా భాగస్వామ్య సంస్థ.

రూ. 25 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు

2. స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్

ఈ పథకం గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి హామీ లేకుండా ప్రభుత్వం రుణాలను అందిస్తుంది.

3. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP)

పట్టణ ప్రాంతాల్లో కొత్త కంపెనీలను పెట్టడానికి, ఉపాధిని కల్పించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

నిర్మాణ రంగానికి రుణ పరిమితి

రూ. 25 లక్షలు సేవా రంగానికి రూ.10 లక్షలు.

అర్హత

18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు.

కొత్త ప్రాజెక్టులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఈ ప్రభుత్వ పథకాలు యువతను ప్రోత్సహించడమే కాకుండా వారి ఆర్ధికాభివృద్ధికి కూడా సహాయపడతాయి. మీరు స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే ఈ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Next Story