స్వచ్ఛందంగా భైంసా బంద్..

by Sumithra |
స్వచ్ఛందంగా భైంసా బంద్..
X

దిశ, భైంసా : ముధోల్ తాలూకా వ్యాప్తంగా పలు ఆలయాల్లో వరుస చోరీ ఘటనలను నిరసిస్తూ బుధవారం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ కి పిలుపు నివ్వగా స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలు బంద్ ని పాటిస్తున్నాయి. మంగళవారం నాగదేవత ఆలయంతో పాటు ఇటీవల బైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయంతో పాటు డివిజన్ పరిధిలోని వానల్పాడ్, పార్టీ (బి) గ్రామాల్లో పలు ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలు తెలిసిందే.

దేవాలయాల్లో వరుస చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సమితి సభ్యులు కోరారు. సంబంధిత ఘటనలను నిరసిస్తూ, చోరీలకు పాల్పడుతున్న దొంగలను వెంటనే పట్టుకోవాలనే డిమాండ్ తో బుధవారం బంద్ కు పిలుపునిచ్చినట్లుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed