చెత్త చెదారంతో నిండిపోయిన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్..

by Sumithra |
చెత్త చెదారంతో నిండిపోయిన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్..
X

దిశ, ఉప్పల్ : చెత్త చెదారంగా మారి, ఖాలి మందు బాటిల్ తో దర్శనమిచ్చింది ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్. మంగళవారం రాత్రి ట్రైవ్ ఈవెంట్ ద్వారా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి భారీగా యువత తరలివచ్చారు. ఈవెంట్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో చెత్తాచెదారం, మందు బాటిళ్లు, వేస్టేజ్ అలానే వదిలేసి వెళ్లారు. ఉదయం వరకు కూడా లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అద్దె కోసం కక్కుర్తి పడ్డారు. శుభ్రత విషయంలో జోక్యం చేసుకోలేదని ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన జీహెచ్ఎంసీ గ్రౌండ్లో మందుతో కూడిన ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story