16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగింపు..

by Sumithra |   ( Updated:2025-01-01 11:32:19.0  )
16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగింపు..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరు 16 మంది టీచర్లను సర్వీస్ నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కొంత మంది 2005 నుంచి కూడా సెలవులో ఉన్నారు. అప్పటి నుంచి సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండా సెలవులో ఉన్నారు. 2010, 11, 12 ఇలా 2022లో కూడా సెలవులు పెట్టి తిరిగి విధులకు హాజరు కాలేదు. దీంతో వీరికి గతంలోనే వీరికి జీతాలను నిలిపివేశారు. వీరికి నోటీసులు అందించినా కూడా స్పందించకపోవడంతో పూర్తిగా సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story