మీ అభిమానం మీద ఒట్టు.. ఎందాకైనా పోరాడుతా: Revanth Reddy

by GSrikanth |   ( Updated:2023-02-08 16:06:03.0  )
మీ అభిమానం మీద ఒట్టు.. ఎందాకైనా పోరాడుతా: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను ప్రారంభించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనం అనంతరం యాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డికి గిరిజన పూజారుల సాంస్కృతి సాంప్రదాయాలతో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ నుంచి పాదయత్రలో వస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. 'పండు ముసలి నుండి పసిబిడ్డల వరకు చూపిస్తోన్న అభిమానం.. కురిపిస్తున్న ప్రేమే నా పోరాటానికి ఇంధనం. పరవళ్లు తొక్కుతున్న మీ ఉత్సాహం నా బాధ్యతను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తోంది. మీరు చూపుతోన్న ప్రేమ మీద ఒట్టు మీ జీవితాల్లో మార్పు కోసం ఎందాకైనా పోరాడుతా' అని సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story