- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు రెడీగా ఉంది.. ఎక్కడికి రావాలో చెప్పండి: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలో.. ఫామ్ హౌస్‌కు రావాలో చెప్పండి.. కర్నాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో చూద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కర్నాటకు వచ్చి చూడాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసిన నష్టమని తెలిసిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ, తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.