BREAKING: ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..!

by Satheesh |   ( Updated:2023-12-01 03:14:20.0  )
BREAKING: ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజవర్గాల్లో మాత్రం పోలింగ్ గంట ముందే 4 గంటలకే ముగిసింది. ఇక, తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాల విడుదలకు ఈసీ అనుమతినిచ్చింది. సాయంత్రం 5.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించేందుకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది. దీంతో పలు మీడియా ఛానెల్స్, సర్వే సంస్థలు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్స్ పోల్స్‌ను విడుదల చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మెజార్టీ సంస్థలు ఎగ్జిట్స్ పోల్స్ వెల్లడించాయి. తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి.. సింగల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించనుందని మెజార్టీ ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేశాయి. గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో పూర్తిగా కాంగ్రెస్ హవా కనిపించింది. మరీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్:

కాంగ్రెస్-56

బీఆర్ఎస్-48

బీజేపీ-10

ఎంఐఎం-5

సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్:

కాంగ్రెస్-65

బీఆర్ఎస్-41

బీజేపీ-4

ఇతరులు-5

చాణక్య ఎగ్జిట్ పోల్స్:

కాంగ్రెస్-67-78

బీఆర్ఎస్-22-31

బీజేపీ-6-9

ఇతరులు-6-7

Read More : బ్రేకింగ్: ఆ స్థానంలో సీఎం KCR ఓటమి..! ఆరామస్తాన్ ఎగ్జిట్స్ పోల్స్‌లో షాకింగ్ రిజల్ట్

Advertisement

Next Story

Most Viewed