- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంటింటి నుంచి మొదలై ఉత్పత్తుల తయారికి అడుగులు..
దిశ, రంగారెడ్డి బ్యూరో : మహిళలు వంటింటి నుండి మొదలై అందుకు కావలసిన కారం, పసుపు, మసాలా వంటి తదితర వస్తువులు తయారు చేసి పారిశ్రామిక వేత్తలు అవుతున్నారని జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి అన్నారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థిక అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సమాఖ్య గ్రూపులకు రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తున్నారని తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన జరిగినది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ భారత దేశాన్ని వ్యవసాయరంగ దేశమని అన్నారు. రైతులు ఆగ్రో బేస్ వస్తువులను తయారు చేసి ఆర్థికంగా ఎదగవచ్చని తెలిపారు. కలెక్టరేట్ లో మహిళా సమాఖ్య గ్రూపులకు కూరగాయలు, పండ్లు అమ్ముటకు స్థలం కేటాయించడం జరిగినదని, అదే విధంగా పోచంపల్లి చేనేత వస్త్రాలు విక్రయించుటకు, చిరు ధాన్యాలు అమ్ముటకు స్థలం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. బ్యాంకుల నుండి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందేందుకు, సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తంగా నిలిచే అధునాతన యంత్ర పరికరాల గురించి ఈ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35% సబ్సిడీతో కూడిన రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు.
ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తోడ్పాటును అందిస్తున్నాయని సూచించారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసినట్లయితే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజలకు కూడా ఆహార ఉత్పత్తులు వారి అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిశ్రమల మేనేజర్ వినయ్ కుమార్, హైదరాబాద్ జిల్లా పరిశ్రమల మేనేజర్ పవన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, పిడి మెప్మా అహ్మద్ సఫీవుల్లా, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గీత రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునంద రాణి, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య గ్రూపుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.