- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె చెరువును కాపాడేదెవరు..? యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
దిశ,శంషాబాద్ : చెరువులు, కుంటలు, నాళాలు తమకేది కాదు అతీతమన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగించి యదేచ్చగా ఎఫ్డిఎల్, బఫర్ జోన్ లో వెంచర్ చేసి ప్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ పేదలను నట్టేట ముంచుతున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు కుంటలు నాలాలలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా కమిటీని తీసుకువచ్చి అక్రమ నిర్మాణ వాలను కూల్చివేస్తూ కబ్జారాయుళ్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు.
అయితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో 36 ఎకరాలలో పురాతనమైన పల్లె చెరువు ఉంది. అయితే ఈ చెరువు ఎప్టీల్ ప్రతి 36 ఎకరాలు ఉండగా డిప్టీఎల్ నుంచి మరో 30 మీటర్లు చుట్టుపక్కల ప్రాంతం అంతా బాఫర్ జోన్ పరిధిలో ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా రాయిని మాత్రం తమకు ఎఫ్.టి.ఎల్ బపర్ జోన్ అంటే లెక్కే లేదనే విధంగా గతంలోనే వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముకుని కోట్లు కట్టించిన ఘటనలు ఉన్నాయి. అదే అతను ఒక అక్రమ నిర్మాణాదారులు కబ్జారాయుళ్లు బరితెగించు మరి భారీ భవనాలు నిర్మిస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇక్కడ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దీని అదునుగా చూసుకొని అక్రమ నిర్మాణా దారులు యదేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే గత రెండేళ్ల క్రితం భారీ వర్షాలు పడి పెద్ద ఎత్తున వరద రావడంతో పల్లె చెరువు కట్ట తెగి కింద ఉన్న కాలనీలో వరద నీటిలో కొన్ని ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులు పల్లె చెరువులు సందర్శించి అక్రమ నిర్మాణా దారులపై కఠిన చర్యలు తీసుకొని, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని గొప్పలు చెప్పి అంతటితో చేతులు దులుపుకున్నారు. అయితే ఇప్పటికైనా పల్లె చెరువులోని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, అక్రమ నిర్మాణ కారకులపై నమోదు చేసి, పల్లె చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
పల్లె చెరువు అక్రమాలపై హైడ్రా దృష్టి సారించేనా ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు కాపాడడానికి హైడ్రా కమిటీని నెలకొల్పి అక్రమ నిర్మాణదారుల భరతం పడుతున్నారు. అయితే హైడ్రా కమిటీకి పల్లె చెరువు ఆక్రమణలపై ఎన్నో ఫిర్యాదులు స్థానికులు చేశారు. పల్లె చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించి వాటిని కూల్చివేసి వారికి సహకరించిన అధికారులు, నాయకులకు పై కేసులు నమోదు చేసి, పల్లె చెరువు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.