- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసైన్డ్ భూ సమస్యలను పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
దిశ, కుల్కచర్ల : రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అసైన్డ్ భూసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండలం అల్మాస్ ఖాన్ పెట్ గ్రామం,చౌడపూర్ మండలం లోని ముక్త వెంకటాపూర్ , మందిపాల్ గ్రామాల్లో అసైన్డ్ భూముల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, పరిగి ఎమ్మెల్యే,జిల్లా అదనపు కలెక్టర్ లింగ నాయక్,ఆర్డీవో వాస్తు, ఏడి సర్వే ల్యాండ్ రాంరెడ్డి లు పాల్గొని రైతుల సమస్యలను,అసైన్మెంట్ భూముల వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతుల దగ్గరకే వచ్చి సమష్యలను పరిష్కరిస్తామని,అసైన్డ్ భూములు కలిగిన రైతులు ఎటువంటి తొందరపాటు పడకుండా తహసీల్దార్,ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరగరాదన్నారు.భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పత్రాలు మీ చేతిలో ఉంటె మీకు ప్రభుత్వం అందించే రైతు భీమా,రైతు భరోసా అన్ని పథకాలకు అర్హులు అవుతారని,మీ వారసత్వానికి మీ ఆస్థి చెందుతుందన్నారు.సమస్యల పరిష్కారానికి ఎన్ని టీంలను ఏర్పాటు చేయాలో చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,స్థానిక నాయకులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.