- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొంరాస్ పేట్ లో అర్బన్ పార్క్, ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉంది : ప్రియాంక వర్గీస్
దిశ, బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం అర్బన్ పార్క్, ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉందని, ఈ ప్రాంతంలో అర్బన్ పార్క్,ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చార్మినార్ సర్కిల్ చీఫ్ ప్రియాంక వర్గీస్ అన్నారు. ఆమె గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ రిజర్వ్ ఫారెస్ట్,కొత్తూరు సెంట్రల్ నర్సరీ,కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లను సందర్శించారు. అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ అభివృద్ధితో పాటు,పక్కనే ఉన్న బొంరాస్ పేట్ చెరువులో వాటర్ స్పోర్ట్స్ ప్రతిపాదనలు కూడా అవసరమని అధికారులకు సూచించారు. అనంతరం సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తూరు సెంట్రల్ నర్సరీని సందర్శించి, ఆ నర్సరీలో రాబోయే వర్షాకాలానికి చందనం మొక్కలను పెంచి, రైతులకు అందేవిధంగా చూడాలని ఆదేశించారు.
ప్రజలకు ఉపయోగపడే మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని,నర్సరీ స్థాయిని మరింతగా పెంచాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని, రంగురంగుల బోగం విలియం మొక్కలను నాటడం ద్వారా రోడ్డుకు ఇరువైపులా మరింత అందాన్ని చేకూర్చాలని హెచ్ఎండిఏ అధికారులకు సూచించారు. అనంతరం కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో చేపట్టిన ప్లాంటేషన్ను సందర్శించి, పరిశీలించారు. సరైన అటవీ మొక్కలను మంచి ఎత్తులో ఉన్న మొక్కలను నాటాలని హెచ్ఎండి అధికారులను ఆదేశించారు. అనంతరం కడా కార్యాలయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, జ్ఞానేశ్వర్ డిఎఫ్,వికారాబాద్ అటవీ అధికారులు,కొడంగల్ పురపాలక కమిషనర్ బలరాం నాయక్,ఇతర సిబ్బందితో సమావేశమై కొడంగల్ లోని వివిధ అటవీ శాఖ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ పర్యటనలో కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సవిత, వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్,సెక్షన్ ఆఫీసర్లు,బీట్ ఆఫీసర్లు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.