Sonakshi Sinha: పెళ్లైన ఆరు నెలలకే ప్రెగ్నెంట్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

by sudharani |
Sonakshi Sinha: పెళ్లైన ఆరు నెలలకే ప్రెగ్నెంట్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
X

దిశ, సినిమా: నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) హ్యాండ్సమ్ జహీర్ ఇక్బాల్‌(Zaheer Iqbal)ను ఇటీవల ప్రేమ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మతాలు వేరు కావడంతో ముందుగా పెద్దల ఆమోదం లేదు. కానీ ఆ తర్వాత అందరినీ ఒప్పించి మరీ రిజిస్టర్ మ్యారేజ్ (Register Marriage) చేసుకున్నారు. అటు ముస్లిం ఇటు హిందూ సాంప్రదాయాలు కాకుండా లీగల్‌గా పెళ్లి చేసుకుని బెస్ట్ అనిపించుకున్నారు ఈ జంట. ప్రజెంట్ ఈ బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ఫ్యామిలీ లైఫ్ (Family Life) ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సోనాక్షి తల్లి కాబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

‘నేను గర్భవతిని అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజెంట్ మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నాము. అయితే.. పెళ్లి తర్వాత కాస్త బరువు పెరిగాను. దీంతో నేను లావుగా కనిపిస్తున్నాను. అందువల్లే నేను ప్రెగ్నెంట్ (pregnant) అంటూ సోషల్ మీడియాలో వార్తలు క్రియేట్ చేస్తున్నారు. కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదు’ అని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రజెంట్ సోనాక్షి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed