Kerala: కేరళలో భారీ వర్షాలు.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by vinod kumar |
Kerala:  కేరళలో భారీ వర్షాలు.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా కేరళ(Kerala)లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైంది. దీంతో భారత వాతావరణ శాఖ(IMD) రాష్ట్రంలోని పతనంతిట్ట, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, కొట్టాయం, త్రిస్సూర్‌లో ఆరెంజ్ అలర్ట్.. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద నిలపడకుండా ఉండాలని సూచించింది. ఐఎండీ వార్నింగ్స్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా విపత్తు నిర్వహణ బృందాలను పలు ప్రాంతాల్లో మోహరించింది.

Advertisement

Next Story

Most Viewed