- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Kunal Kamra: కునాల్ కామ్రాపై మరో మూడు కేసులు..!

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కాగా.. ప్రస్తుతం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై మహారాష్ట్రలో మూడు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ కేసులన్నీముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. షిండేపై కామ్రా చేసిన వ్యాఖ్యలపై ఖార్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అతనిపై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది. అయితే, దర్యాప్తులో పాల్గొనమని ముంబై పోలీసులు కామ్రాకు రెండుసార్లు సమన్లు జారీ చేశారు. వారం రోజులు కావాలని కామ్రా కోరినప్పటికీ పోలీసులు అతని అభ్యర్థనను తిరస్కరించారు. ఇదిలా ఉంటే అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టును కునాల్ కామ్రా ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే ముంబై యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ స్టూడియోలో కునాల్ కామ్రా కామెడీ షో నిర్వహించి దాన్ని రికార్డు చేశారు. అందులో షిండేను‘‘గద్దార్’’ (ద్రోహి) తో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇది వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే, కునాల్ కమ్రామ షిండేకు క్షమాపణలు చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. అయితే, దీనిపైనా కునాల్ స్పందించారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడట్లేదని.. కోర్టు ఆదేశిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు.