- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవమైన తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. విద్యాసంస్థలకు వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవులు (Holidays) కలిసి రావటంతో భక్తులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో శనివారం 26 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం స్వామివారిని 64,536 మంది భక్తులు దర్శించుకోగా.. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. అలాగే, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది.
Next Story