Congress: ఢిల్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా.. 21 మంది అభ్యర్థుల ప్రకటన

by vinod kumar |
Congress: ఢిల్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా.. 21 మంది అభ్యర్థుల ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు గాను 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ (Congress) గురువారం విడుదల చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ లిస్టును ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానం నుంచి సందీప్ దీక్షిత్‌ (Sandeep deekshith)కు అవకాశం ఇచ్చింది. బద్లీ నుంచి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, బల్లిమారన్ నుంచి మాజీ మంత్రి హరూన్ యూసుఫ్, పట్పర్‌గంజ్‌లో చౌదరి అనిల్ కుమార్‌లను బరిలోకి దించింది. ఇక, ఇటీవలే ఆప్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీలంపూర్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్‌కు అదే స్థానం నుంచి టికెట్ కేటాయించింది. అయితే సందీప్ దీక్షిత్ బరిలో నిలిచిన న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) చీఫ్ కేజ్రీవాల్ బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది. కానీ ఆప్ ఇంకా అధికారికంగా దీనిని ధ్రువీకరించలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed