- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zomato: జొమాటోకు రూ. 803 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు భారీ పన్ను నోటీసులు జారీ అయ్యాయి. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించలేదనే కారణంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులిచ్చినట్టు థానేలోని జీఎస్టీ విభాగం పేర్కొంది. 2019, అక్టోబర్ 29 నుంచి 2022, మార్చి 31 వరకు చెల్లించని బకాయిల ఆధారంగా రూ. 803.4 కోట్ల భారీ పన్ను నోటీసులను ఇచ్చింది. ఇందులో రూ. 401.7 కోట్ల పన్నులు ఉండగా, మిగిలిన మొత్తం దానికి పెనాల్టీ, వడ్డీ విధించినట్టు జీఎస్టీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌కు దాఖలు చేయనున్నట్టు జొమాటో ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో సైతం జొమాటోకు ఇదే అంశంపై జీఎస్టీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీకి కూడా రూ. 326.8 కోట్ల పన్ను బహాయిలపై నోటీసులు జారీ చేశారు. జొమాటో ఫుడ్ ఆర్డర్ బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. అందులో ఆహార పదార్థాల ధరతో పాటు ఫుడ్ డెలివరీ ఛార్జీ. మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై 5 శాతం పన్ను. ఈ పన్నును జీఎస్‌టీ మండలి 2022, జనవరి నుంచి అమలు చేస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లకు డెలివరీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది.