Rijiju: కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ మోషన్‌.. 60 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలు

by vinod kumar |
Rijiju: కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ మోషన్‌.. 60 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiran rijiju)పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్(Sagarika gosh) గురువారం ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతలను అవమానించేలా ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు తీసుకొచ్చారు. ఈ తీర్మానానికి 60 మంది ప్రతిపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. రిజిజు ప్రతిపక్ష సభ్యులను పదే పదే అవమానించారని, పార్లమెంటు లోపల, వెలుపల ప్రతిపక్ష ఎంపీలపై వ్యక్తిగత పదాలను ఉపయోగించారని సాగరిక తెలిపారు. ఇది పూర్తిగా సరికాదని, ఆయన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారరని ఫైర్ అయ్యారు. అంతకుముందు రోజు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీలపై మండిపడ్డారు. వారికి సభలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు ప్రివిలేజ్ మోషన్‌ నోటీస్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed