IPO: రూ. 1,000 కోట్ల ఐపీఓ.. సెబీకి పత్రాలు సమర్పించిన బ్లూస్టోన్

by S Gopi |
IPO: రూ. 1,000 కోట్ల ఐపీఓ.. సెబీకి పత్రాలు సమర్పించిన బ్లూస్టోన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బెంగళూరుకు చెందిన ఆభరణాల విక్రయ సంస్థ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ త్వరలో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు రానుంది. తాజాగా తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి పత్రాలను సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 1,000 కోట్ల వరకు నిధులను సేకరించనుంది. ఇందులో తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో ప్రస్తుతం ఉన్న ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నట్టు సమాచారం. ఓఎఫ్ఎస్ ద్వారా 2.40 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉంది. ఓఎఫ్ఎస్‌లో పాల్గొనే ప్రమోటర్లలో కలారి కేపిటల్స్, సామా కేపిటల్స్, సునీల్ కాంత్ ముంజాల్‌తో పాటు హీరో ఎంటర్‌ప్రైజ్ పార్ట్‌నర్ వెంచర్స్ ఉన్నాయి. బ్లూస్టోన్ కంపెనీ ట్రెండింగ్ వజ్రాలు, బంగారం, ప్లాటినం, ఇతర ఆభరణాలను విక్రయిస్తుంది. బ్లూస్టోన్ ఐపీఓ నుంచి సేకరించిన నిధుల్ల్లో కార్యకలాపాల అవసరాలుతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూ.750 కోట్లు కేటాయించాలని యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా కంపెనీకి 257కి పైగా స్టోర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed