- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇల్లందు పట్టణంలో జానులిరి సందడి
దిశ, ఇల్లందు : ఢీ 2 డ్యాన్స్ షో విన్నర్ జానులిరి ఇల్లందు పట్టణంలో సందడి చేసింది. ఈమెకు దండు సారయ్య(సారిక) ఘన స్వాగతం పలికారు. గురువారం దండు సారయ్య ఆహ్వానం మేరకు ఇల్లందు పట్టణానికి విచ్చేసిన జానులిరిని డప్పు వాయిద్యాలతో అభిమానుల నడుమ స్థానిక అభయాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన కూడలిలో భారీ ర్యాలీతో బయలుదేరి దండు సారయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మడత వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిభ ఎవరి సొత్తూ కాదని నిరూపించి ఏకంగా ఢీ2 షో విజేతగా నిలిచిన జానులిరికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తనకు ఇద్దరు చెల్లెళ్లతో పాటుగా జానులిరి మూడో చెల్లె అని సారిక భావోద్వేగానికి గురయ్యారు. జానులిరి కింది స్థాయి నుంచి అహర్నిశలు శ్రమించి ఈనాడు విజేతగా నిలవడం సంతోషకరమని దండు సారయ్య అన్నారు. కాగా విజేత జానులిరి మాట్లాడుతూ ఈ స్థాయిలో స్వాగతం పలకడం జీవితంలో మొదటిసారి అని, అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు, యువకులు పాల్గొన్నారు.