- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెంచిన డైట్ చార్జీల కనుగుణంగా మెనూ అమలు పరచాలి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గురుకుల పాఠశాలలు,సంక్షేమ హాస్టళ్లలో 'డైట్' చార్జీలను పెంచిందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. పెంచిన చార్జీలకనుగుణంగా 'మెనూ'ను ఈ నెల 14 నుండి అమలుపరిచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డైట్ చార్జీల పెంపు,నూతన మెనూ అమలు ప్రారంభ కార్యక్రమం గురించి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకనుగుణంగా మెనూ ప్లాన్ చేసి, దానిని శనివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు,పార్లమెంటు సభ్యులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సంబంధిత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు,ముఖ్యంగా తల్లి హాజరయ్యేటట్లు చూడాలని ఆమె ఆదేశించారు. 8 సంవత్సరాల తర్వాత 40 శాతం డైట్ చార్జీలను,అదేవిధంగా 16 ఏండ్లు తర్వాత కాస్మోటిక్ చార్జీలను 200 శాతం ప్రభుత్వం పెంచిందన్నారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో పాటు..ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాలో జడ్చర్ల,దేవరకద్ర నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. వంట గదుల్లో పరిశుభ్రత,ఆహారం నాణ్యతలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ,అన్ని పాఠశాలలు,హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసినట్లు,ఆహార నాణ్యతలో ఎలాంటి ఆలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.పెంచిన డైట్,కాస్మోటిక్స్ చార్జీల వివరాలను తెలిపేలా ప్రతి గురుకుల హాస్టల్స్ లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు,సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.