సమూహ' సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభ

by Naveena |
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో శనివారం జరిగే 'సమూహ' సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర తొలి మహాసభలు జయప్రదం చేయాలని ఫోరం ఆహ్వాన సంఘం బాధ్యులు ఎం.రాఘవాచారి,కె.లక్ష్మణ్ గౌడ్,ఎస్.జగపతిరావు,ఖలీల్ తదితరులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలుగు సాహిత్యకారులు విద్వేషాలు లేని సమాజం కోసం,మానవీయ విలువల కోసం గత సంవత్సరం ఆగస్టు నెలలో రాష్ట్రస్థాయిలో 'సమూహ సెక్యూలర్ రైటర్స్ ఫోరం' ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర మహాసభలు శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సభకు ప్రొఫెసర్ హరగోపాల్,కల్లూరి భాస్కరం,ప్రముఖ కవులు స్కైబాబా,ప్రొ.కాసిం,మెట్టు రవీందర్,కాత్యాయని విద్మహే తదితరులు పాల్గొంటారు. జిల్లాలోని మేదావులు,సాహిత్య ప్రియులు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed