HDFC Bank: నిబంధనలను పాటించనందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సెబీ వార్నింగ్ లెటర్

by S Gopi |
HDFC Bank: నిబంధనలను పాటించనందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సెబీ వార్నింగ్ లెటర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వార్నింగ్ లెటర్ ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బ్యాంకు పలు నిబంధనలను ఉల్లంగించినట్టు గుర్తించామని సెబీ తన లేఖలో పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్లకు మూలధన నిధుల వివరాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిషేధం వంటి సెబీ నిబంధనలను పాటించలేదని హెచ్చరించింది. దీనికి బదులిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెబీ పేర్కొన్న అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెబీ ఇచ్చిన వార్నింగ్ లెటర్ మూలంగా బ్యాంకు ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. సెబీ లేఖ సాధారణ నియంత్రణ సమస్యల పరిష్కారం కోసమేనని, వాటిని బ్యాంకు అనుసరిస్తుందని పేర్కొంది. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నెల ప్రారంభంలో మొదటిసారిగా రూ. 14 లక్షల కోట్ల మార్కును అధిగమించిన సంగతి తెలిసిందే. గడిచిన నెల రోజుల్లో బ్యాంక్ షేర్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది.

Advertisement

Next Story