‘అనేక అవమానాలు ఎదుర్కొంటున్నాం.. మా కులాల పేరు మార్చండి’

by Gantepaka Srikanth |
‘అనేక అవమానాలు ఎదుర్కొంటున్నాం.. మా కులాల పేరు మార్చండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులాల పేర్లు మార్పు కోరుతూ బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్‌కు వివిధ కుల సంఘాల ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గురువారం వారి నుంచి వితులను స్వీకరించిన బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ.. ఉమ్మడి పది జిల్లాల్లో కులాల పేరు మార్పుపై వచ్చిన వినతులు, ప్రతిపాదనలు రికార్డు చేసినట్టు తెలిపారు. అనంతరం కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. దొమ్మర, వంశరాజ్, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు తమ తమ కులాల స్థితిగతుల గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

దొమ్మర కులం వారు తమ కులం పేరును గడవంశీగా మార్చాలని కోరారు. వంశరాజ్ కులం వారు తమ కులం పేరులో నుండి పిచ్చిగుంట్ల అనే పదాన్ని పూర్తిగా తొలగించాలని, తమ్మలి కులం వారు తమ కులం నుండి నాన్ బ్రాహ్మిన్, సూద్రా క్యాస్ట్ పదాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పదాలతో సమాజంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్నామని ఆరే రాములు, మురళి కృష్ణ , వట పత్ర సాయి, కుల ప్రతినిధులు కమిషన్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్, రిసెర్చ్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Next Story